గత నెల 27వ తేదీన హైదరాబాద్ షాద్ నగర్ ప్రాంతంలో యువ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు నిందితులు ఎంతో కిరాతకంగా అత్యాచారం చేయడంతో పాటు ఆమెను ఎంతో పాశవికంగా హత్య చేసి కాల్చి బూడిద చేయడం జరిగింది. అయితే ఆ దారుణ ఘటన బయటకు వచ్చిన 24 గంటల్లోనే నిందితులైన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే.. ఈ ఎన్ కౌంటర్ ఫేక్ అని కూడా ఫ్రూవ్ అయింది.
అయితే.. తాజాగా దిశా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దిశా కమిషన్ నివేదిక కేసు…..తెలంగాణ హైకోర్టు చేరింది. దిశా కేసులో నిందితులది ఫేక్ ఏన్ కౌంటర్ అంటూ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పై అభిప్రాయాలను హైకోర్టులో తేల్చుకోవాలని తాజాగా సుప్రీం కోర్టు..ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు కు చేరింది దిశా కేసు నివేదిక. దిశా కేసులో ఏమికస్ క్యూరీ గా దేశాయ్ ప్రకాష్ రెడ్డి ని నియమించింది హైకోర్టు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.