పెళ్లై పదేళ్లు అయింది.. పిల్లల్ని కనే సామర్థ్యం.. స్టేజ్ మీద ఉపాసన సందేహాలు !

-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అపోలో ప్రతాప్రెడ్డి మనవరాలు అయిన ఉపాసన ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుండగా.. వీరి పెళ్లి అయ్యి పది ఏళ్ళు కావస్తున్నందున పిల్లల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సద్గురు ఫాలోవర్ అయిన ఉపాసన తాజాగా పిల్లల్ని కనడం మీద సద్గురును ప్రశ్నించింది. అయితే దీనిపై సద్గురు అద్భుతంగా సమాధానం ఇచ్చాడు. ఉపాసన ఏమని అడిగింది అంటే..

” నాకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది. నా లైఫ్ నాకు ఎంతో నచ్చింది. ఐ లవ్ మై లైఫ్. కానీ ప్రజలు మాత్రం నా విషయంలో (RRR) గురించి ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకు?(R) రిలేషన్షిప్, (R) ఎబిలిటీ టు రీ ప్రొడ్యూస్,(R) రోల్ ఇన్ లైఫ్. అంటూ జనాలు ఎప్పుడూ ఎందుకు నా గురించి ఆలోచిస్తూ ఉంటారో చెప్పండి” అంటూ ఉపాసన సద్గురును తన మదిలోని సందేహాన్ని బయట పెట్టింది. దీనికి సద్గురు సమాధానమిస్తూ..

” పిల్లల్ని కనకుండా దూరంగా ఉండే వారికి నేను ఒక అవార్డు ఇస్తాను. అసలు ఇప్పుడు పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ అలా ఉంటే నేను అందరికీ ఒక్కొక్క అవార్డు ఇచ్చుకుంటూ వస్తాను. ఒకవేళ నువ్వు ఆడ పులి అయితే పులి పిల్లలకు జన్మనివ్వు అని నేను అడుగుతాను. ఎందుకంటే అవి ఈ భూమ్మీద అంతరించిపోతున్నాయి గనుక. కానీ మన మానవ జాతి భూమిమీద లెక్కకు మించి ఉంది.

పని చేయాలనే ఆలోచన మైండ్ లో ఉంటే పిల్లల్ని కనే ఆలోచనలు రావు. పని లేని వాళ్లకు ఇటువంటి హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్లు ఏ పని లేక పిల్లల్ని కంటూ ఉంటారు. కాబట్టి ఈ తరంలో పిల్లలు కనకుండా ఉండటమే మనం ప్రపంచానికి చేసే గొప్ప మేలు”. అని సద్గురు సమాధానమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news