ఈ సారి సంక్రాంతి సినిమాల రిలీజ్ పెద్ద పజిల్ లా ఉంది. ఈ సంక్రాంతికి బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించింది మైత్రీ మూవీస్ మేకర్స్ వారు. ఇప్పుడు ఈ రెండూ సినిమాలకు థియేటర్స్ కోసమే పెద్ద యుద్దం జరిగే అవకాశం ఉంది. దీనిలో దిల్ రాజు డబ్బింగ్ సినిమా చేరి విషయాన్ని ఇంకా జఠిలం చేసింది.
గత సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలను ఆడనివ్వమని తెలుగు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చాకే ప్రాధాన్యతా క్రమంలో చివరిలో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చేలా నిర్మాతలు నిర్ణయించారు. దీంతో దానిని 2023 సంక్రాంతికి కూడా ఇదే ఉండాలని ఛాంబర్ పెద్దలు కూడా అధికారికంగా నోటీస్ పంపారు. దీనితో దిల్ రాజు విజయ్ తో తమిళంలో తీస్తున్న డబ్బింగ్ సినిమా వారసుడు ఆగే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై సీనియర్ నిర్మాత సురేష్ బాబు సంచలన కామెంట్స్ చేసారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు.’తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి.చెన్నైలో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తరువాతి రోజే తీసేస్తారు. కంటెంట్ ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అలాగే టిక్కెట్స్ రేట్లు పెంచడం ను కూడా నేను వ్యతిరేకిస్తా అందుకే ముఖ్య మంత్రి కలవలేదు అన్నారు. అంతే కాకుండా షూటింగ్ బంద్ అనేది ఎవరికీ ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.