వారికి గుడ్ న్యూస్… స్కీమ్ పొడిగింపు.. రూ.43 వేలకు పైగా సబ్సిడీ..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ తో చాలా రకాల లాభాలని పొందొచ్చు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి. మీరు కూడా రూఫ్‌టాప్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్.

ఈ స్కీమ్ ని కేంద్రం మార్చి 31, 2026 వరకు ఎక్స్టెండ్ చేసింది. పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను పెట్టేందుకు ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ చెల్లించక్కర్లేదు. ఇంటి కరెంట్ బిల్ ని కూడా తగ్గించుకోవడానికి అవుతుంది. కరెంటు బిల్లును తగ్గించుకోవాలనుకుంటే ఈ పధకాన్ని వినియోగించుకోండి. ఈ స్కీమ్ తో మీ కరెంటు బిల్లు జీరో అయిపోతుంది.

పైగా భారీ ఎత్తున సబ్సిడీ కూడా ఈ స్కీమ్ పై వుంది. కేంద్రం 2026 వరకు రూఫ్‌ టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ఎక్స్టెండ్ చేసింది. ఈ విషయాన్నీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ చెప్పింది. అలానే నేషనల్ పోర్టల్‌లో దరఖాస్తు కోసం మీరేమి ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు. మీటర్, టెస్టింగ్ కోసం సంస్థ నిర్ణయించిన అమౌంట్ ఏ ఇవ్వండి. అంత కంటే ఎక్కువ ఏమి కట్టక్కర్లేదు.

ఒకవేళ కనుక విక్రేత, ఏజెన్సీ లేదా వ్యక్తి నుండి ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే అప్పుడు మీరు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సోలార్ ప్యానెళ్ల కోసం నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. దీని ద్వారా దేశం మొత్తానికి మూడు కిలోవాట్ల కెపాసిటీ కి కిలోవాట్‌కు రూ. 4,588 సబ్సిడీ పొందవచ్చు. మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌పై రూ.43,000 కంటే ఎక్కువ సబ్సిడీ ని ప్రభుత్వం ఇస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news