సూర్య కుమార్ అరుదైన రికార్డు.. 900 రేటింగ్ పాయింట్స్

-

ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న సూర్య కుమార్ యాదవ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. శ్రీలంక పై మెరుపు శతకం బాదిన సూర్య కెరీర్ లో తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో 900 రేటింగ్ పాయింట్స్ ను అందుకున్నాడు.

టి20 లో 900 రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి భారతీయ క్రికెట్ గా సూర్య రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఇద్దరు ఆటగాళ్లు, డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్ మాత్రమే టి20 రేటింగ్ పాయింట్ సాధించారు. ప్రస్తుతం సూర్య ఖాతాలో 908 పాయింట్లు ఉన్నాయి. అత్యధికంగా డేవిడ్ మలాన్ 915 పాయింట్లు సాధించాడు. సూర్య టి20 లో మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడితే మలాన్ రేటింగ్ పాయింట్లను అధిగమిస్తాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news