NTRతో సూర్యకుమార్ యాదవ్..మిస్టర్ 360 ఎమోషనల్ ట్వీట్

-

హైదరాబాద్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లను హీరో ఎన్టీఆర్ ఓ హోటల్ లో కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. అనంతరం ఎన్టీఆర్ తో గిల్, శ్రేయస్ అయ్యర్, చాహాల్, ఇషాన్ కిషన్, సూర్య, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఫోటోలు దిగారు.

అయితే ఇండియన్ మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ భార్యతో కలిసి తారక్ తో స్పెషల్ గా ఫోటో తీసుకున్నాడు. ‘నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. RRR కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు మరోసారి కంగ్రాట్యులేషన్స్’ అని ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూర్య. కాగా, ఇవాళ ఉదయం నుంచి ఉప్పల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news