లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

-

పాకిస్థాన్‌ ఉగ్రవాద సం‌స్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీని ఐక్యరాజ్యసమితి.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భద్రతా మండలికి చెందిన అల్‌ఖైదా ఆంక్షల కమిటీ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో మక్కీ ఆ‌స్తులను జప్తు చేయటం, ఆయన ప్రయాణంపై ఆంక్షలు, నిషేదం, ఆయుధ ఆంక్షలు అమలు కానున్నాయి.

గత సంవత్సరం భారత్‌, అమెరికా ఉమ్మడి ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ తన వ్యక్తిగత, సంస్థల ఆంక్షల జాబితా లోకి మక్కీని చేర్చింది. కాగా మక్కీ.. 26/11 ముంబై ఘటన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు స్వయాన బావ కావడం కీలకాంశంగా మారింది.

మక్కీ ఎల్​ఈటీలో ఉండగా 2000లో ఎర్రకోటపై దాడులు జరిగాయని చెప్పింది. 26/11 ముంబయి దాడులను ‘భారత్​లో లష్కరే తోయిబా చేసిన అత్యంత దారుణమైన దాడి’గా అభివర్ణించింది. 2018లో శ్రీనగర్, ఖాన్​పొరా, బారాముళ్ల, గురెజ్​లో ఎల్​ఈటీ చేసిన దాడులను ప్రస్తావించింది. కాగా, మక్కీపై ఆంక్షలు ఇండియా దౌత్య విజయమని భారత మాజీ దౌత్యవేత్తలు అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news