ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎస్ సమీర్ శర్మ మమ్మల్ని దారునంగా అవమానించారు.. నలుగురం జేఏసీల నేతలు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళితే ఒక నిమిషం సమయం కూడా కేటాయించ లేదని మండిపడ్డారు. మర్యాద కోసం అయినా కూర్చోమని చెప్పలేదని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ కలెక్టర్లకు చెప్పారని అగ్రహించారు.
మమ్మల్ని అవమానించిన రోజు ఈ విషయం గుర్తు లేదా?? అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రశ్నించారు.ఆర్ధిక శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశ పౌరుడిగా అధికారుల పై ఫిర్యాదు చేసే హక్కు నాకు ఉందన్నారు. అధికారుల వ్యవహార శైలి ఇలానే ఉంటే కేంద్ర డీఓపీటీకు కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు.. తాము తగ్గబోమని పేర్కొన్నారు.