సుశాంత్ ఏ కాదు…. ‘అతని కేసు’ కూడా ఆత్మహత్య చేసుకుంది…!

-

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వ్యవహారంలో జరుగుతున్నవన్నీ కూడా ఇప్పుడు దేశ ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. మీడియా కూడా దేశంలో ఏ సమస్యలు లేనట్లు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తో పాటుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్స్ కేసు ని హైలెట్ చేస్తూ వస్తోంది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అదే విధంగా ఆమె సోదరుడును అరెస్ట్ చేయడంపై మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామాలు అన్నీ కూడా రియా చక్రవర్తి చుట్టూనే తిరిగాయి. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కొన్ని దర్యాప్తు సంస్థలు రియా చక్రవర్తి ని టార్గెట్ చేసి మరీ విచారణలు చేశాయి. తండ్రి కృష్ణ కిషోర్ చేసిన 15 కోట్ల ఆరోపణ చుట్టూ రాజకీయం కూడా జరిగింది. రియా చక్రవర్తినీ అదే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదేపదే విచారించింది.

ఆ తర్వాత సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించింది. ఇక అక్కడి నుంచి కూడా అన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఏదైనా కేసు సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు ఇస్తే రోజుల తరబడి ఎదురు చూసే సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన మరుసటి రోజే ముంబైలో వాలిపోయారు. వారికి బృహన్ ముంబై కార్పొరేషన్ కూడా సహాయ సహకారాలు అందించింది. సిబిఐ అధికారులు ఈ క్వారాంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని… ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే కనుక వాళ్ళు అభ్యర్థన పెట్టుకోవాలి అనీ ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఇక అక్కడి నుంచి కూడా సుశాంత్ సింగ్ ఇంటికి వెళ్లడం అక్కడ సుశాంత్ సింగ్ వాడిన కాఫీ తాగిన కప్పు వాడిన చెప్పులు ఉరి వేసుకున్న ఫ్యాన్ అదేవిధంగా మరికొన్ని వ్యక్తిగత వస్తువులను కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు.

అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క సాక్ష్యం కూడా మేము పట్టుకున్నామని సిబిఐ అధికారులు మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి లేదు. రియా చక్రవర్తినీ అదుపులోకి తీసుకున్నారు అని ప్రచారం జరిగింది. కానీ ఆమెను కూడా అదుపులోకి తీసుకోలేదు. ఆ తర్వాత సుశాంత్ సింగ్ వంట మనిషిని అదేవిధంగా సుశాంత్ సింగ్ సన్నిహితులు కొంద రిని విచారించారు. అయినా సరే ఒక సాక్ష్యం కూడా సీబీఐ అధికారులకు దొరకలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో కి వెళ్ళిపోయింది. డ్రగ్స్ కి సంబంధించిన చాటింగ్ ఏదో దొరికిందని దానికి సంబంధించి నార్కోటిక్స్ బ్యూరో కి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రియా చక్రవర్తి సమన్లు జారీ చేయడం చక్రవర్తిని విచారించడం ఆమెను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయి. ఇక ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని సినీ పరిశ్రమలో కూడా దాడులు జరుగుతున్నాయి. చివరికి ఆత్మహత్య కేసు మాత్రం నీరుగారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news