ఆస్కార్ జ్ఞాపకాల గదిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. మరో బాలీవుడ్ నటుడు కూడా..

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ఉత్సవం నిన్ననే జరిగింది. ఉత్తమ చిత్రంగా నొమద్ లాండ్ పురస్కారం అందుకోగా, ఉత్తమ దర్శకురాలిగా నొమద్ లాండ్ చిత్రానికి దర్శకత్వం వహించిన జావో పురస్కారం దక్కించుకుంది. ఐతే భారత సినిమా కళాకారులైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రిషి కపూర్ పేర్లని ఆస్కార్ మెమోరియల్ గ్యాలరోలో భద్రపరిచారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, ఎమ్ ఎస్ ధోనీ వంటి ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాన్ని అందించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం సినిమా అభిమానులందరినీ బాధకి గురి చేసింది.

ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండగా ఇలా ఎందుకు చేసుకున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మెదిలింది. అదంతా పక్కన పెడితే ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు ఆస్కార్ మెమీరియల్ గ్యాలరీలో ఉంది. ఈ మేరకు సుశాంత్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. సుశాంత్ సింగ్ బావ విశాల్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. అలనాటి అందాల నటుడు రిషికపూర్ పేరు కూడా జాబితాలో ఉంది.