స్వాతి ముత్యం సినిమా ఓటిటి లో ఇంత తొందరగానా..!!

-

సినిమా పరిశ్రమలో కొన్ని లెక్కలు భలేగా వుంటాయి. ఆ సినిమా ఏ రోజు విడుదల కాబోతుంది, అలాగే ఓటిటి డీల్స్, టీవి ఛానెల్ డీల్స్ అన్ని పక్కాగా అమలు చేస్తారు.కాని ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి 20  రోజులు కాకుండానే ఓటిటిలో రాబోతోంది.ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ సినిమానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గా పరిచయం అయ్యిన బెల్లం కొండ గణేష్ మొదటి చిత్రం “స్వాతిముత్యం”. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది లక్ష్మణ్ కే కృష్ణ. ఈ సినిమాలో  హీరోయిన్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది మరి ఈ దసరా కానుకగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం, అందరిని నవ్వించింది.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న ప్రముఖ సంస్థ ఆహా తో అగ్రిమెంట్ కూడా అయ్యింది. కాని దీనిలో మేకర్స్ చిన్న మార్పు చేశారు. వాస్తవానికి  ఈ సినిమా అక్టోబర్ 28 న స్ట్రీమింగ్ కు రావాలి. కాని ఈ సినిమా  అక్టోబర్ 24 నుంచే స్ట్రీమింగ్ కి రాబోతుందని పోస్టర్ వేసారు.  ఇన్ని సినిమాల మధ్యలో ఈ సినిమా థియేటర్ లో వుండే అవకాశం లేదని, అలాగే దీపావళి పండుగ సందర్భంగా వచ్చినట్లు వుంటుందని ముందుగానే ఓటిటి కి వచ్చేస్తుందట .అదీకాక ఈ సినిమా షూటింగ్ దశలోనే ఓటిటి అగ్రిమెంట్ అయ్యిందని సినిమా వర్గాలు అంటున్నాయి. అందుకే సినిమా ముందుగానే వస్తుందట

Read more RELATED
Recommended to you

Latest news