Breaking : మెగా పూనకాలు లోడింగ్‌… దీపావళికి టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌..

-

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి 154వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చిరంజీవి 154వ చిత్రం టైటిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళి సందర్భంగా అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ దీపావళికి మనం ‘మాస్ మూలవిరాట్’ కు స్వాగతం పలుకుదాం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

Mega 154: Mass Moolavirat arriving | cinejosh.com

 

“బాస్ వస్తున్నాడు… పూనకాలు లోడింగ్” అంటూ మెగా ఫ్యాన్స్ ను హుషారెత్తించేలా ట్వీట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. కాగా ఈ మాస్ ఎంటర్టయినర్ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇదే ఖరారవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయిక కాగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news