స్విస్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను భారీగా పెంచింది. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో -0.25శాతంగా ఉన్న వడ్డీ రేటును.. ఏకంగా 0.5శాతంగా మార్చింది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది స్విస్ నేషనల్ బ్యాంక్.
అంతకుముందు.. అమెరికన్ ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను మరో 75 పాయింట్లు పెంచుతున్నట్లు ఛైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడ వడ్డీరేట్లు 3.25 శాతానికి చేరాయి. ఈ సందర్భంగా పావెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా ఆర్థికమాంద్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.