స్కూల్‌ బ్యాగ్‌లో నాగుపాము కలకలం

-

ఉదయాన్నే స్కూల్ బ్యాగ్ తీసుకుని పాఠశాలకు వెళ్లింది ఓ విద్యార్థిని. క్లాస్ మొదలవగానే బ్యాగ్ తెరిచింది. అంతే ఒక్కసారిగా క్లాసంతా అరుపులు మొదలయ్యాయి. విద్యార్థులంతా భయంతో తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకీ ఏమైందంటే.. ఆ విద్యార్థిని బ్యాగులో నాగుపాము ఉంది. బ్యాగ్ తెరవగానే ఒక్కసారిగా బయటకు వచ్చి విద్యార్థులందరిని భయపెట్టింది.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ విద్యార్థిని స్కూల్‌ బ్యాగ్‌లో నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని బదౌని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని రోజులాగే బ్యాగ్‌ వేసుకుని స్కూల్‌కు వచ్చింది. తరగతిలో కూర్చున్న బాలిక.. పుస్తకం తీసేందుకు బ్యాగ్‌ను తెరువగా నాగుపాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడ్డారు. కాసేపటి తర్వాత సర్పాన్ని ఖాళీ ప్రదేశంలోకి విడిచిపెట్టేశారు.

Read more RELATED
Recommended to you

Latest news