మీకు సిండికేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా? అయితే తప్పకుండ ఈ విషయాలని సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వచ్చే నెల అంటే 2021 జూలై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ కొత్త రూల్స్ ని తీసుకు రానుంది.
దీనితో ఈ విషయాల్లో మార్పులు రానున్నాయి. ఇక అసలు విషయం లోకి వెళ్ళిపోతే.. వచ్చే నెల నుంచి బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు పని చేయవు అని బ్యాంక్ తెలిపింది. సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మారతాయని కెనరా బ్యాంక్ అంది.
ఈ విషయాలని సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు గమనించాలి. అందువలన సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాలని భావిస్తే పాత కోడ్స్ పని చెయ్యవు. కేవలం కెనరా బ్యాంక్ కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు ఉపయోగించాలి.
కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు కనుక మీరు తెసులుసుకోవాలంటే www.canarabank.Com/IFSC.Html లింక్ ద్వారా పొందొచ్చు. లేదంటే కెనరా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి తెలుసుకోవచ్చు. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని కస్టమర్స్ గమనించాలి.