అవినాష్ రెడ్డికి షాక్.. మధ్యంతర పిటిషన్లు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

-

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్‌రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.  ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతిస్తూ.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని స్పష్టం చేస్తూ.. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తోందని, తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ అవినాష్‌రెడ్డి వారం క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియోల ద్వారా రికార్డు చేయకపోవడాన్ని సవాలు చేశారు. జనవరి 28, ఫిబ్రవరి 24న సీబీఐ సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అభ్యర్థించినా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.

విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. విచారణ సందర్భంగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరారు. వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news