టీ20 వరల్డ్ కప్ ఫ్రీ స్ట్రీమింగ్ …..ఎందులో అంటే!

-

ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది జరగబోయే టి20 ప్రపంచ కప్ లైవ్ ప్రసారాలను ప్రముఖ ఓటీటీ యాప్‌ డిస్నీ హాట్‌ స్టార్‌ ఉచితంగా అందించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే t 20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి.

మెగా టోర్నీలను ఇండియా క్రికెట్‌ ఫ్యాన్స్ కి ఉచితంగా అందించడం హాట్‌ స్టార్‌కు ఇదే కొత్తకాదు. గతేడాది ఆ సంస్థ.. ఆసియా కప్‌,వన్డే ప్రపంచ కప్‌ను ఉచితంగా అందించింది. వన్డే ప్రపంచ కప్‌ సమయంలో ఎలాంటి రుసుము లేకుండా ఫ్యాన్స్ కి అసలైన క్రికెట్‌ మజాను అందించింది. అయితే ఉచిత ప్రసార సేవలు కేవలం మొబైల్‌ యూజర్స్‌కు మాత్రమే.. స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌ల ద్వారా వీక్షించే వారు మాత్రం సంబంధిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news