జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ నిన్న ఎంపిక చేసింది.ఈ టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కలేదు. దీనికి కారణం ఐపీఎల్ ఇంపాక్ట్ నిబంధనే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ టార్ఆర్డర్ ఫామ్లో ఉండటంతో ఈ ఐపీఎల్లో రింకూకు పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు చెన్నై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ టాప్ ఆర్డర్లో బరిలోకి దిగుతున్న శివమ్ దూబే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే 350 రన్స్ చేసిన దూబే భారీ షాట్లు ఆడుతూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు.
కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. టీ 20 వరల్డ్ కప్ కి పంత్, శాంసన్ ఇద్దరిలో ఎవ్వరినీ ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ఇద్దరినీ ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక కే.ఎల్. రాహుల్ కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రిజర్వు ప్లేయర్ గా ఎంపికవుతాడనుకున్న రాహుల్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం.