యూఏఈ వేదికగా టీ-20 వరల్డ్‌ కప్‌

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే.. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌ క్రికెట్‌ పైనా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా మెగా టోర్నీ ఐపీఎల్‌ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే… మరో టోర్నీపైనే ఈ మహమ్మారి ఎఫెక్ట్‌ పడింది. ఇండియా వేదికగా జరగాల్సిన టీ-20 వరల్డ్‌ కప్‌ వేదిక మారింది.

ఈ టోర్నీని యూఏపీలో నిర్వహిస్తామని.. పీటీఐకీ బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపారు. టీ-20 వరల్డ్‌ కప్‌ తేదీలపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే… అక్టోబర్‌ – నవబంర్‌ నెలల్లో ఈ టీ-20 వరల్డ్‌ కప్‌ సిరీస్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే.. ఈ టోర్నీకి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారా? లేదా ? అనేది తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news