అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపాలిటీ ఛ్తెర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీ భవనం పోలీసుల వలయంలోకి వేల్లిన్న్ది. ఒక మున్సిపాలిటీ భవనం చుట్టూ 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 36 వార్డుల్లో వైసీపీకి 16, టీడీపీకి 18, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు.
ఇక్కడ చైర్మన్ స్థానం చేజిక్కించుకోవాలంటే 19 మంది బలం అవసరం. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపితే వైసీపీ బలం 18కి చేరింది. దీంతో సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. ఇప్పటికే టిడిపికి సీపీఐ మద్దతు తెలిపింది. టిడిపి క్యాంపులో సీపీఐ అభ్యర్థి సహా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉండడంతో ఆయన కూడా టీడీపీకి మద్దతు పలికే అవకాశం కనిపిస్తోంది.