అల్లంలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అల్లంను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అల్లంలో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను ఇస్తాయి. అల్లం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు నిత్యం అల్లంను తీసుకుంటే దాంతో వారి షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయని పలువురు సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
అల్లంలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయని, అందువల్ల అల్లంను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి నిత్యం ఉదయాన్నే పరగడుపునే రసం రూపంలో తీసుకుంటే కొద్ది రోజుల్లోనే డయాబెటిస్ అదుపులోకి వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
అల్లంను నిత్యం తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా తగ్గవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అల్లంలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగిస్తాయట. దాంతో అధిక బరువు తగ్గుతారట. ఇక డయాబెటిస్ పేషెంట్లు అల్లంను తీసుకోవడం వల్ల వారి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.