ఇక ఎండాకాలం వచ్చేస్తోంది. దీని వల్ల విపరీతమైన దాహం ఉంటుంది. పైగా టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకోవాలంటే ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన మరియు బెస్ట్ డ్రింక్స్ ఉన్నాయి. వాటిని చూసేయండి..!
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లు మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. పైగా కొబ్బరి నీళ్ళల్లో అవసరమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
మ్యాంగో లస్సీ:
మ్యాంగో లస్సీ కూడా ఈ టెంపరేచర్ ని తట్టుకోవడానికి బాగుంటుంది. మీరు దీనిలో తేనే వేసుకుని తాగండి. ఆరోగ్యానికి కూడా మంచిది.
ఆమ్ పన్నా:
ఆమ్ పన్నా ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడి కాయలు మరియు పుదినా ఆకులు ఉపయోగించుకుని సులువుగా చేసుకోవచ్చు. ఇది హీట్ స్ట్రోక్ వంటివి రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది.
బట్టర్ మిల్క్:
బట్టర్ మిల్క్ తాగడం వల్ల వెంటనే రిఫ్రెష్ అవుతాము. దీనిలో చల్లదనాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయి. వేడి నుండి బయట పడడానికి దీనిని తీసుకుంటే మంచిది.
ఐస్డ్ మింట్ గ్రీన్ టీ :
పుదీనా ఫ్లేవర్ తో ఉన్న దీనిని తీసుకోవడం వల్ల ఇది మైండ్ ని, బాడీ ని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. పైగా దాహం కూడా వెంటనే తీరుతుంది.
బార్లీ నీళ్లు:
బార్లీలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఇది ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది. కిడ్నీలను కూడా ఇది శుభ్రం చేస్తుంది. ఎటువంటి టాక్సిన్స్ లేకుండా అది ఫ్రీ చేస్తుంది.
తాండాయ్:
ఇది ఎక్కువగా ఉత్తర భారత దేశం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆక్టివ్ గా ఉండొచ్చు.