తొడ కండరాలు పట్టేసుకున్నాయా..? ఐతే ఈ ఆహారం తీసుకోండి..

-

కండరాల తిమ్మిరి.. కండరాల తిమ్మిరి చాలా సాధారణమైన సమస్యే కావచ్చు కానీ ఒక్కోసారి చాలా సీరియస్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తిమ్మిరి తొడ వెనక్ భాగంలో గానీ ముందు భాగంలో గానీ అవుతుంది. ఐతే ఇది కొన్ని సెకన్ల పాటు ఉంటుంది. అలానే వదిలేస్తే నిమిషాల పాటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తొడ కండరాలు తిమ్మిరి కలగకుండా చూసుకోవాలి. దీనికోసం కొన్ని ఆహారాలు బాగా పనిచేస్తాయి.

అసలు ఈ కండరాలు ఎందుకు తిమ్మిరెక్కుతాయనేది ముందుగా తెలుసుకుందాం.

ఎక్కువ వ్యాయామం చేయడం దీనికి ప్రధాన కారణం.
నీరు సరిగ్గా త్రాగకపోవడం.
సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాల లోపం.
కండరానికి గాయాలు కలగడం.
ఎక్కువ చెమట బయటకు పోవడం.
థైరాయిడ్, మూత్రపిండ సమస్యలున్నవారికి.

ఐతే ఈ సమస్య నుండి బయటపడవేసే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయ

కండరాల తిమ్మిరి కలగడానికి ముఖ్య కారణం నీరు సరిగ్గా తీసుకోకపోవడమే. అందుకే పుచ్చకాయని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే అధిక శాతం నీరు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు శరీరంలో రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది.

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం, సోడియం, కాల్షియం వంటివి కండరాల తిమ్మిరి బాధనుండి బయటపడేస్తాయి. అదే కాదు ఇందులో నీటిశాతం అధికంగా ఉంటుంది.

అరటిపండు

వ్యాయామం చేసే ముందు అరటిపండు తినడం మంచిదని చాలామంది అభిప్రాయం. ఇందులో ఉండే ఖనిజ లవణాలు కండరాల తిమ్మిరి కలగకుండా చేస్తాయి.

స్వీట్ పొటాటో

విటమిన్ ఎ, సి అధిక శాతం కలిగిన స్వీట్ పొటాటో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. గాయాలు తగ్గడానికి స్వీట్ పొటాటో బాగా పనిచేస్తుంది. కండరాల తిమ్మిరి తగ్గడానికి స్వీట్ పొటాటో చాలా మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news