బిగ్ బాస్ చివరి దశకి వచ్చేసిన తరుణంలో మరింత ఆసక్తిగా మారింది. ఈ రోజు జరిగిన ఎపిసొడ్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. చివరి దశకి వస్తుంది కావున, ప్రతీ ఒక్కరూ టైటిల్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అదీగాక ఈ వారం అఖిల్ తప్ప మిగతా సభ్యులందరూ నామినేషన్లలో ఉన్నారు. అందువల్ల ఆ జాగ్రత్త మరింత పెరిగింది.
ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళిపోయిన అఖిల్, మోనాల్ విషయంలో కొంచెం జాగ్రత్తపడుతున్నట్లు అనిపిస్తుంది. ఊరికే కోపం తెచ్చుకుంటున్నావ్ అని ఊరికూరికే అంటున్న మోనాల్ ని అలా ఎందుకంటున్నావ్, అది బయటకి ఎలా వెళ్ళిపోతుందో తెలుసా.. అంటూ మాట్లాడాడు. ఇక సోహైల్, అఖిల్.. ఇద్దరూ ఎవరో ఒకరు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తామనే ఆశతో ఉన్నారు. హౌస్ లో వీరిద్దరూ మాట్లాడుకుంటూ, నువ్వు గెలిస్తే నాకేం ఇస్తావ్ అనుకుంటూ మాట్లాడుకున్నారు.
ఖాళీగా ఉన్న టైమ్ లో ఏం చేస్తావని అఖిల్ అడగ్గా, సినిమాలు చూస్తానని సోహైల్ సమాధానం చెప్పాడు. దానికి ల్యాప్ టాప్ లోనా అని అడిగితే కాదు ఫోన్ లోనే, ల్యాప్ టాప్ లేదు అని చెప్పాడు. అప్పుడు అఖిల్, నేను టైటిల్ గెలిస్తే నీకు ల్యాప్ టాప్ కొనిస్తా, అదే నువ్వు గెలిస్తే నాకు బైక్ కొనివ్వు అంటూ అన్నాడు. దానికి సోహైల్ సరే కొనిస్తా అని తలూపాడు.
బిగ్ బాస్ హౌస్ లో స్నేహాలు కేవలం హౌస్ వరకే పరిమితం అని చాలా స్నేహాలు నిరూపించాయి. కానీ అఖిల్, సోహైల్.. ఇద్దరి మధ్య కనిపించే స్నేహం హౌస్ దాటిన తర్వాత కూడా ఇలాగే ఉండేలా ఉందని మాట్లాడుకుంటున్నారు.