కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త మోటారు వాహన నిబంధనలను ప్రవేశ పెడుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అక్టోబర్ 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఈ- చలాన్ సహా వాహనాలకు సంబంధించిన కీలక పత్రాల నిర్వహణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోర్టల్ ద్వారా జరుగుతుందని స్పష్టం చేసింది. లైసెన్సింగ్ అథారిటీ ద్వారా అనర్హులుగా ప్రకటించిన వారు… లేదా రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు వరుసగా పోర్టల్‌లో నమోదు చేయబడతాయని స్పష్టం చేసింది.
అలాంటి రికార్డులు క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తామని పేర్కొంది. ఐటి సేవలను ఉపయోగించడం ద్వారా… ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ ద్వారా… ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం చేయవచ్చు అని కేంద్రం భావిస్తుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని పోలీసులు వేధించే అవకాశం ఉండదు అని కేంద్రం అంటుంది. మోటారు వాహనాల నిబంధనల ప్రకారం… మెరుగైన పర్యవేక్షణ మరియు అమలు కోసం 1.10.2020 పోర్టల్ ద్వారా అమలు, వాహన పత్రాల నిర్వహణ మరియు ఇ-చలాన్ల అమలుకు అవసరమయ్యే సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు 1989 లోని వివిధ సవరణలకు సంబంధించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసింది.
1. మీ డ్రైవింగ్ లైసెన్స్ ను డిజిటల్ గా తీసుకోవచ్చు.
2. డ్రైవర్లు వాహన లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పత్రాలను తీసుకెళ్లడం తప్పనిసరి కాదు, ఎందుకంటే ఈ సమాచారం డిజిటల్‌గా సేవ్ చేస్తారు. పత్రాలు ప్రభుత్వ పోర్టల్ ద్వారా ధృవీకరించబడతాయి. 3. డిజి-లాకర్ లేదా ఎం-పరివహన్ అనే ప్రభుత్వ పోర్టల్‌లో పత్రాలు అప్ లోడ్ చేస్తారు. మొబైల్ నెంబర్ ద్వారా వీటిని సేవ్ చేసుకోవచ్చు.
4. పోర్టల్‌లో ఇ-చలాన్లు జారీ చేయబడతాయి.
5. లైసెన్సింగ్ అథారిటీ చేత అనర్హమైన లేదా రద్దు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు వరుసగా పోర్టల్‌లో నమోదు చేయబడతాయి, కాబట్టి లైసెన్స్ అనర్హులుగా ఉన్న రికార్డు డిజిటల్ విధానంలో భద్రపరుస్తారు.