సీఎం మాకు నీతి నిజాయితీగా ఉండమని చెప్పారని తలసాని పేర్కొన్నారు. ఇండ్లు చూసే వాళ్లకు కూడా నిజాయితీ ఉండాలని, నిజాయితీగా ఒప్పుకోవాలని అన్నారు. ఇళ్ళ కోసం ఏ దళారికి ప్రజలు డబ్బులు ఇవ్వొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం నిజాయితీగా ఇండ్లు ఇస్తోందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్ మునక గురించి మాట్లాడుతూ వర్షానికి నీళ్లు రాకుంటే… మంటలు వస్తాయా..? అని ఆయన ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలు భూతద్దంలో పెట్టి చూస్తున్నాయని అన్నారు. సొంత ఇండ్లు కట్టుకుంటేనే ఆలస్యం అవుతోందని, భట్టి కూడా నిజాయితీగా ఒప్పుకోవాలని అన్నారు.
ఇవాళ తిరిగిన తర్వాత లిస్ట్ ఇస్తామని, మిగిలితే.. మా మున్సిపల్ అధికారుల ను అప్పగిస్తామని మీరు వెళ్లి చూసుకోవచ్చని తలసాని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ మాత్రమే కాదు, అన్నీ చూపిస్తామని ఆయన అన్నారు. 70 ఏండ్లలో ఇంత అద్భుతంగా పనులు జరగలేదని, మున్సిపల్ ఎన్నికల కోసం ఆ ఇండ్లు కట్టేవా ? అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇండ్లు మాత్రమే చూపిస్తామన్న ఆయన వాళ్ళేదో కట్టినట్టు… మేమేదో ఏమీ చేయనట్టు మాట్లాడొద్దని అన్నారు. ఈ పర్యటనతో భట్టి సంతృప్తి చెందుతాడని, కానీ హైకమాండ్ ఊరుకుంటుందా ? ఆయన బాధ ఆయనకు ఉంటుందని పేర్కొన్నారు.