హైదరాబాద్: వినాయక నిమజ్జనాలపై హైకోర్టులో రివ్యూ పిటీషన్.. తెలంగాణ మంత్రి

-

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం గురించి హైకోర్టు కొన్ని సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీలు లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయంలో రివ్యూ పిటీషన్ వేయడానికి తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికిప్పుడు బేబి పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమని, ఆల్రెడీ మంటపాల్లో వినాయక ప్రతిమలు నిలబెట్టారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.

అందువల్ల హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసుకోనివ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేయబోతున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం తర్వాత 48గంటల్లో సాగర్ ని శుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేసారు. రివ్యూ పిటిషన్ లో ఏం జరుగుతుందో చూడాలి. బేబి పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టం అని చెబుతున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news