తాలిబాన్లు లక్ష కోట్లు సంపాదిస్తున్నారా…? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తో సమానం…!

-

ప్రపంచంలో ఉన్న ఉగ్రవాద సంస్థల్లో తాలిబాన్ ఉగ్రవాద సంస్థ అతిపెద్దది… దాదాపు 70 వేల మందికి పైగా ఉగ్రవాదులు ఈ సంస్తలో ప్రత్యక్షంగా పరోక్షంగా పని చేస్తున్నారు. దాదాపు ఆఫ్ఘనిస్తాన్ ని ఎక్కువ భాగం వారి ఆధీనంలోనే ఉంచుకున్నారు. 1996 నుంచి 2001 వరకు అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పాలించారు. ఇక ఇప్పుడు కూడా ఆ దేశంలో వారు బాంబు దాడులు చేయడం, గిరిజన ప్రాంతాల్లో పరిపాలించడం వంటివి చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో కూడా భారీగా తాలీబాన్లు పని చేస్తున్నారు.

మరి ఇంత మందిని వాళ్ళు ఏ విధంగా నడిపిస్తున్నారు…? వాళ్ళ ఆదాయవనరులు ఏంటి అనేది ఒకసారి చూస్తే… దాదాపు లక్ష కోట్ల రూపాయలను వారు వసూళ్ళ ద్వారా సంపాదిస్తున్నారు. నల్ల మందు మాదక ద్రవ్యాల ద్వారా భారీగా వారు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నల్లమందును ఉత్పత్తి చేస్తుండగా… అది ఎక్కువ భాగం పండించేది తాలిబాన్లు ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే. రైతుల నుంచే మొదట 10 శాతం పన్ను వసూలు చేస్తున్న తాలిబాన్ ఉగ్రవాదులు, ఓపియమ్‌ను నల్లమందుగా మార్చే లేబరేటరీల నుంచి, వాటిని డ్రగ్ రూపంలో స్మగ్లింగ్ చేసే వ్యాపారుల నుంచి ఎక్కువగా వసూళ్ళకు పాల్పడుతున్నారు.

తాలిబన్లు టెలికమ్యూనికేషన్స్, మొబైల్ ఫోన్ ఆపరేటర్ల నుంచీ, విద్యుత్ సంస్థల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారు. ఖనిజాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న తాలిబాన్లు అక్కడి మైనింగ్ వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. పాకిస్తాన్‌తో పాటు, గల్ఫ్ దేశాలకు చెందిన వ్యాపారస్తులు తాలిబాన్లకు భారీగా సాయం చేస్తున్నారు. ఇలా అన్ని మార్గాల నుంచి దాదాపు లక్ష కోట్ల వరకు తాలిబాన్లు ఆదాయాన్ని సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news