మిల్క్ బ్యూటీ తమన్నా గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్ , హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ నటిగా మోడల్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అంతకుమించి మంచి నృత్యకారుని కూడా.. 2005లో చాంద్ షా రోషన్ చెహ్రా సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈమె ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్నా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 లో ఆమె బోల్డ్ గా కనిపించబోతోంది.
ఇకపోతే సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆమె సింగపూర్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడి దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకోవడంతో వాటిని చూసిన అభిమానులు ఒక్కసారిగా స్టన్ అవుతున్నారు. అందులో కార్గో జీన్స్ తో పాటు వైట్ లోనక్ టీ షర్ట్లు వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత రెడ్ కలర్ బికినీ వేసుకొని స్విమ్ చేస్తూ రచ్చ చేసింది.
చేప పిల్లలా.. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ బికినీతో ఈమె ఇచ్చిన హాట్ ట్రీట్ కు యువత ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదిరిపోయే అందంతో పాటు ఆమె తినే ఫుడ్.. అక్కడ కనిపించిన నత్త.. కొటేషన్ బ్రిడ్జిని ఫోటోలుగా తీసి షేర్ చేసింది. అంతేకాదు అందంతోపాటు తాను ఇంకా ఏమేమి చూసి ఆస్వాదించిందో కూడా వివరించింది. ఇకపోతే ఈమె ఫోటోలు షేర్ చేసిన రెండు గంటల్లోనే సుమారుగా 3 లక్షలకు పైగా లైకులు, 2000 పైగా కామెంట్లు రావడం గమనార్హం.
View this post on Instagram