తెలుగు మూవీస్​కు మ్యూజిక్ అందించేవాడు.. కానీ ఇప్పుడు తమిళ్​లో స్టార్​ హీరో.. ఎవరో తెలుసా?

-

తమిళ్ స్టార్ హీరోగా విజయ్ ఆంటోనికి మంచి గుర్తింపు ఉంది. ఎప్పుడూ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ఉంటాడు విజయ్ ఆంటోని. డాక్టర్ సలీమ్, బిచ్చగాడు సినిమాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు విజయ్. మరీ ముఖ్యంగా బిచ్చగాడు సినిమాలోని మదర్ సెంటిమెంట్ ఇక్కడ బాగా వర్కవుట్ అయింది. తెలుగులో విజయ్ ఆంటోనికి ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత వరుస పెట్టి డబ్బింగ్ సినిమాలతో విజయ్ దాడి చేశారు. అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.

అయితే విజయ్ ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం అందించి అవార్డులు కూడా అందుకున్నాడు అనే విషయం పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఇక ఆయనకు ఉన్న మరొక ఆయుధం గాత్రం. ఎంత బాగా సంగీతం కొట్టగలడో అంతే బాగా పాడగలడు కూడా. 2005లో మొదటి సారిగా ఒక సింగర్​గా, ఒక సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత ఏడాది తిరక్కుండానే నటనలోకి ప్రవేశించాడు. అప్పుడు మొదలెట్టిన నటన ప్రస్థానం 18 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కేవలం నటుడిగా మాత్రమే కాదు. ప్రతి ఏటా ఎన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడో అన్నే సినిమాల్లో పాటలు పాడుతూ సంగీతం కూడా చేస్తున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో ఇలా అన్ని విభాగాల్లో సక్సెస్ ఫుల్​గా కొనసాగుతున్న హీరోలలో విజయ్ ఆంటోనీ మాత్రమే ముందు వరుసలో ఉంటాడు. ఇక విజయ్ ఆంటోనీ పేరుకు మాత్రమే తమిళుడు కానీ సౌత్​లోని అన్ని భాషల్లో పట్టు సాధించాడు. అందుకే కేవలం తమిళం లోనే కాకుండా తెలుగు సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం చేపట్టి, పాటలు కూడా పాడాడు. కన్నడలో కూడా రెండు సినిమాకు సంగీత దర్శకత్వం అందించాడు విజయ్.

https://youtu.be/P6OkP9bUC4w

ఇక విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన సినిమాల్లో ఒకటి శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమా కాగా, మరొక సినిమా రవి తేజ హీరోగా నటించిన దరువు. ఇక దరువు సినిమాకు సంగీతం అందించడం మాత్రమే కాకుండా రెండు పాటలు కూడా పాడాడు. దరువు సినిమాకు సంగీతం అందించింది చాలామంది ఇప్పటి వరకు థమన్ అని అనుకుంటున్నారు. కానీ విజయ్ ఆంటోనీ తనదైన నైపుణ్యంతో పక్క భాషల్లో కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news