వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ‘మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వీటి ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించారు. కానీ సీఎం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు’ అని తమ్మినేని పేర్కొన్నారు. ఇచ్చేవాడికి పుచ్చుకునే వాడి మధ్య మరో చేయి లేదు అని స్పీకర్ తమ్మినేని సీతారం పేర్కొన్నారు.
బటన్ నొక్కితే అంతా పెదల ఖాతలకు వస్తుంది.. గతంలో పించన్ కోసం కొట్లాటలు, లంచాలు ఉండేవి.. ప్రస్తుతం అలాంటివి ఎక్కడ కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సీఎంను మనం మరోసారి గెలిపించుకోవాలని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి చెందిన 175 మందిని గెలిపించి 175 మంది ఎమ్మెల్యేలను సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. ఆరోగ్యశ్రీ , జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు అని స్పీకర్ తమ్మినేని సీతారం వెల్లడించారు. నేను పేదల పక్షాన ఉంటానని, మేలు చేస్తేనే ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు అని ఆయన తెలిపారు. సీఎంగా మళ్లీ జగన్ ని చేస్తేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యనించారు.