ఒక పండు ఇప్పుడు పాకిస్తాన్ ను వణికిస్తోంది..!

-

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ తో వ్యాపార సంబంధాలను పాకిస్తాన్ తెంచుకుంది. ఇక్కడి నుంచి టమోటా ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఇది ఆ దేశ ఆహార పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ లో కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. మరీ ప్రత్యేకించి ఒక పండు పాకిస్తాన్ ను వణికిస్తోంది. ఆ పండు ధరలు దిగిరాక కొనుగోళ్లు మందిగించి పోయాయి.

ఇంతకీ ఆ పండు ఏంటో తెలుసా.. తినే పండు కాదండీ వంటల్లో వేసుకునేది. అదే టమాటా పండు. అవును మరి పాకిస్తాన్ లో టమోటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయట. పాక్ లోని పలు ప్రాంతాల్లో టమోటా ధరలు కిలో 180 రూపాయల నుంచి 3వందల రూపాయలకు చేరుకుందట.

అందుకే ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి టమోటాలను దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. పాకిస్తాన్ లో భారీ వర్షాలతో టమోటా పంట దెబ్బతినడం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో టమాటా సరఫరా పూర్తిగా మందగించింది.

ఇలాంటి సమయంలో అందుబాటులుో ఉన్న అన్ని చర్యలు పరిశీలిస్తోంది. ఈ టమాటా ప్రభావం వల్ల ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకోవాలా అని పాక్ మల్లగుల్లాలు పడుతోంది. భారతీయుల్లాగానే పాకిస్తాన్ ప్రజలు కూడా తమ వంటల్లో టమాటాను విరివిగా వాడుతుంటారు. అందువల్ల టమాటా ధరలు పాక్ లోని ప్రతి సామాన్యుడికీ సెగలు పుట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news