అమెరికాలో పేదల ఆకలి తీర్చిన “తానా”..!!!

-

పొరుగు వారికి సాయం చేయాలన్న తపన, మనం సంపాదించే దానిలో ఎంతో కొంత పక్క వారికి  పంచాలన్న గొప్ప మనుసున్నవారు చాల మంది ఉంటారు. అవసరాన్ని తెలుసుకొని సాయం చేయటం ముఖ్యం. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టాలన్న గొప్ప మనుసున్నవారు, ఎంతో మంది ఆకలి,దప్పికలు తీరుస్తూ,మానవసేవే మాధవసేవ అని తృప్తిపడతారు. ఇలానే ఎన్నో సంస్థలు వారు చేసే సేవాకార్యక్రమాలలో భాగంగా అన్నదనాన్ని కూడా చేస్తుంటారు.

ఈ కోవలోనే అమెరికాలోని తెలుగు వారి కోసం స్థాపించబడిన అతిపెద్ద సంఘమైన తానా, అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తానా సభ్యులు అమెరికాలో వివిధ ప్రాంతాలలోని నిరుపేదలకు తమవంతు సాయంగా అన్నదనాన్ని చేస్తున్నారు. తాన, తెలుగు వారి సంస్కృతినికాపడటం, తెలుగు వారికి తోడుగా ఉండటంతోపాటు, నిరుపేదలకి కూడా సేవ చేస్తూ వారి ఉన్నతమైన మనుసును చాటుకున్నారు..

 

పోర్ట్ ల్యాండ్ లోని తానా విభాగం అన్నదాన  కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న సాల్వేషన్ ఆర్మీలోని ఏర్పాటు చేసింది. నూతన సవత్సరం సందర్భంగా  ఈ  అన్నదానం చేసింది. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు అందరు పాల్గొనటమే కాదు, స్వయంగా వారి వండి వడ్డించారు. పోర్ట్ ల్యాండ్ లోని తానా సభ్యులు అయిన గుత్తి కొండ అశోక్ ప్రియా దంపతులు  ఈ కార్యక్రమ నిర్వహణకి ఆహార పదార్ధాలకి అందించి మానవత్వం చాటుకున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news