ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సిఎం హోదాలో తొలిసారి సిబిఐ కోర్ట్ కి హాజరు కానున్నారు. దాదాపు గత ఏడాదిన్నరగా కోర్ట్ కి దూరంగా ఉంటున్న ఆయనకు ఇటీవల సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కోర్ట్ ఆదేశించింది. దీనితో ఆయన కోర్ట్ కి వెళ్ళడం తప్పనిసరిగా మారింది.
అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 గా ఉండగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏ2 గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్నానని తాను కోర్ట్ కి హాజరు కావడం సాధ్యం కాదని తన తరుపున తన లాయర్లు వదిస్తారని పిటీషన్ వేసినా దాన్ని కోర్ట్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హోదాకు, నేరానికి సంబంధం లేదని కాబట్టి హాజరు కావాలని పేర్కొంది.
అయితే జగన్ మాత్రం ముందస్తుగా ఆయన తరఫున లాయర్లు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ప్రతీ శుక్రవారం అనుమతి తీసుకుంటున్నారు. ఆయన గత కొద్ది వారాలుగా కోర్ట్ కు దూరంగా ఉంటున్నారు. ఇది కేసు విచారణపై ప్రభావం చూపుతుంది అంటూ సిబిఐ తరుపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసారు. దీనితో 10 ఆయన కోర్ట్ కి తప్పనిసరిగా హాజరు కావాలని కోర్ట్ ఆదేశించింది.