కావల్సిన పదార్థాలు: బెట్కి లేదా రోహు ఫిష్ : 500grms(బోన్ లెస్ ముక్కలుగా కట్ చేసుకోవాలి) అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp పసుపు: చిటికెడు ధనియాల పొడి: 1tsp కారం: 1/2tsp పెరుగు: 2tbsp నిమ్మరసం: 1tbsp శెనగపిండి: 1tbsp నూనె: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా ఛాట్ మసాలా: 1tsp పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి) ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
తయారు చేయు విధానం:
ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు, పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కలకు బాగా పట్టించి 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్లో ధనియాల పొడి, కారం, తందూరి పౌడర్ మరియు 2 టేబుల్ స్పూన్ పెరుగు, నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.తర్వాత ఈ మిశ్రమంలో శెనపిండిని కూడా వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ తందూరి మసాలా, పెరుగు మిశ్రమాన్ని చేప ముక్కలకు రెండు వైపులా పట్టించాలి. తర్వాత ఓవెన్ ను 300డిగ్రీల్లో హీట్ చేయాలి. ఈ లోగా చేప ముక్కల మీద నూనె చిలకరించాలి.
తర్వాత ఈ చేపముక్కలను అన్నింటిని మిక్స్ చేసి టూత్ స్టిక్స్ కు గుచ్చాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం నూనెను చిలకరించాలి.
తర్వాత ఈ చేప ముక్కలను గ్రిల్ చేసి 60పర్సెంట్ పవర్ లో 15నిముషాలు బేక్ చేసుకోవాలి.
అంతే తందూరి ఫిష్ టిక్కా రెడీ. తర్వాత స్టిక్స్ నుండి చేప ముక్కలను సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని కొత్తిమీర తరుగు మరియు ఛాట్ మసాలాతో , సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయాలి.