రంగస్థలం నుంచి వెండితెరపైకి వచ్చి ఎన్నో సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ కు రైటర్ గా పని చేశారు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన ‘శివ’ సినిమాకు డైలాగ్స్ తనికెళ్ల భరణి రాశారు. కాగా, ఆయన దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నంతో వర్క్ చేస్తున్నారు. ఆయనకు గతంలో మణిరత్నంతో పని చేసే అవకాశం వచ్చి మిస్ అయింది. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
నటీ నటులు ఎవరైనా సరే ఒక్క సినిమాలో అయినా మణిరత్నం దర్శకత్వంలో పని చేయాలని అనుకుంటారు. అలా తాను కూడా ఒక్క సినిమాలోనైనా మణిరత్నంతో పని చేయాలని అనుకున్నారు. ఆ టైమ్ లో తనికెళ్ల భరణికి సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దళపతి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దాంతో తనికెళ్ల భరణి ఆడిషన్ కు వెళ్లారు. మణిరత్నం సినిమా స్టోరి మొత్తం తనికెళ్ల భరణికి వినిపించారు. అయితే, సారా కాంట్రాక్టర్ పాత్రకు భరణిని తీసుకోవాలని మణిరత్నం అనుకున్నారు.
అలా ఆడిషన్ చేసిన తర్వాత పాత్రకు తగ్గ ఏజ్ లేదని తనికెళ్ల భరణికి ఆ పాత్ర ఇవ్వలేదు మణిరత్నం. దాంతో భరణి చాలా బాధపడ్డారు. కాగా, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మణిరత్నంతో పని చేసే అవకాశం తనికెళ్ల భరణికి దక్కింది. అయితే, ఈ సారి నటుడిగా కాకుండా రచయితగా పని చేసే అరుదైన అవకాశం భరణికి వచ్చింది.
ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్-1’కు తెలుగు రచయితగా తనికెళ్ల భరణి పని చేశారు. ఇంత గొప్ప అవకాశం తనకు ఇచ్చినందుకు మణిరత్నంకు భరణి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ జనాలకు విశేషంగా నచ్చింది. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. జయరాం, ప్రకాశ్ రాజ్, త్రిష, ఐశ్వర్యా రాయ్, కార్తీ, విక్రమ్ లు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న పార్ట్ -1 విడుదల కానుంది.