పరీక్షల్లో ఫెయిల్‌ చేశాడని ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన స్టూడెంట్స్‌..

-

స్కూల్‌ అన్నాక గొడవలు.. టీచర్లు అన్నాక పన్నిష్మెంట్లు ఇవ్వడం కామన్‌.. మనం కూడా చిన్నప్పుడు ఎన్ని తన్నులు తినలేదు.. ఎండలో నుల్చోలేదు.. నీల్‌డౌన్‌లు చేయలేదు..అయితే ఇప్పుడు ఓ వింత ఘటన జరిగింది. పరిక్షల్లో ఫెయిల్ చేశాడని ఆ ఉపాధ్యాయుడిని స్టూడెంట్స్‌ చెట్టుకు కట్టేసి చితకబాదారు. కొద్ది రోజుల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఉంది.. ఈ టైంలో ఇలాంటి ఘటనలు జరగటం ఉపాధ్యాయులందరిని కాస్త కలిచేవేస్తుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!!
జార్ఖండ్‌ దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ ఉదంతం చోటుచేసుకుంది. సదరు పాఠశాలలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్.. 9, 10వ తరగతులకు పాఠాలు చెప్తారు. అయితే.. తాజాగా ప్రకటించిన పరీక్షా ఫలితాలలో 32 మందికి గాను 11 మంది ఫెయిల్ అయ్యారు. వీరంతా సుమన్ కుమార్‌పై కోపం పెంచుకున్నారు. ఆ టీచర్ తమను కావాలనే ఫెయిల్ చేశాడని అనుకోని ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిని ఫెయిల్ అయిన విద్యార్థులంతా ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్టుకు కట్టేసి కొట్టారు.
ఇతడితో పాటు.. స్కూల్ క్లర్క్ సోనేరామ్‌ని కూడా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం జరిగింది..మంగళవారం వెలుగులోనికి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్‌కు చేరుకుని 9,10 క్లాసులలో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు గుర్తించారు. దీనిపై పాఠశాల యాజమాన్యం, సదరు ఉపాధ్యాయుడిని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కానీ విద్యార్థుల భవిష్యత్తు పాడు చేయడం ఇష్టం లేక ఉపాధ్యాయుడు అలానే ఉండిపోయాడట..ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. దీనిపై తీవ్ర దుమారంచెలరేగటంతో పాఠశాలను రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.
తనను అలా చెట్టుకు కట్టేసి కొట్టినా.. ఆ ఉపాధ్యాయుడు.. పిల్లల భవిష్యత్తు కోసం కంప్లైంట్‌ ఇవ్వకపోవడం చాలా గొప్ప విషయం. పనిష్మెంట్‌ ఇచ్చినప్పుడు కోపం రావడం సహజం.. కానీ వాళ్లు కావాలని అయితే ఇవ్వరు కదా.. మనం కూడా చిన్నప్పుడు ఎన్నో పనిష్మెంట్‌లు తీసుకుని..నేడు ఈ స్థాయిలో ఉన్నాం. ఏమంటారు..?

Read more RELATED
Recommended to you

Latest news