ఇ-కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న టాటా గ్రూప్..!

-

ప్రముఖ దేశీయ సంస్థ టాటా గ్రూప్ “సూపర్ యాప్” ద్వారా ఇ-కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో “సూపర్ యాప్” ను ఆవిష్కరించనుంది. ఈ యాప్‌తో ప్రతిదీ ఆర్డర్ చేసేలా టాటా రూపొందిస్తుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఈ-స్టోర్ స్టార్ క్విక్ ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలు అందిస్తోంది టాటా గ్రూప్.

వీటన్నింటి సమ్మిళితంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఇప్పటికే అమెజాన్, ఇటీవలి కాలంలో వాటికి పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకొచ్చాయి. కాలానికి అనుగుణంగా టాటా గ్రూప్ కూడా సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news