చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు చాలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ప్రభావం ఇప్పటికీ జగన్ పైన పడుతూనే ఉంది. ఈరోజే నాంపల్లి కోర్టులో జగన్ హాజరయ్యారు కూడా. అయితే జగన్ అసలు పోటీ లేకుండా ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించిన తర్వాత ఆయన టైం స్టార్ట్ అయింది.. ఇక చంద్రబాబు జైలుకే అని అంతా అనుకున్నారు.
అయితే నిదానంగా జగన్ ఆ లక్ష్యం దిశగా ఒక అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు పై వైసీపీ నేత.. మాజీ ఎంపీ పొట్లూరి వరప్రసాద్ కొన్ని సెటైరికల్ కామెంట్లు విసిరారు. రాజధాని అమరావతి రైతుల ఉద్యమం కోసం అమరావతి పరిరక్షణ సమితి నేతలతో కలిసి చంద్రబాబు నిన్న జోలిపట్టి మచిలీపట్నంలో విరాళాలు సేకరించారు.
దీనిపై స్పందిచిన పీవీపై ఐదువేల కోట్లు హారతి కర్పూరంలా తగలబెట్టారు. ఇంకా జోలె పట్టుకొని అడుక్కునేలా ప్రతి ఆంధ్రుడిని రోడ్డు మీద పడవేసారు. అదే జోలెలో మీ హెరిటేజ్ షేర్స్, జూబ్లీహిల్స్ భవనాలు కూడా దానమిస్తే, బెజవాడ, వెనిస్ ఏమిటి అంతకుమించిన నగరాన్ని చేద్దాం అంటూ సరిలేరు మీకెవ్వరు సార్ అని చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
ఇదంతా చూస్తుంటే జగన్ ఇప్పటికే పరోక్షంగా చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ చిన్న లూప్ హోల్ దొరికినా అతన్ని కేసులో అడ్డంగా బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చాలా క్లియర్ గా అర్థం అవుతోంది. మొన్న క్యాబినెట్ లో కూడా అమరావతి స్థలాల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన విషయం పై విచారణ చేపట్టేందుకు ఆమోదం తెలిపిన జగన్ గవర్నమెంట్ బాబు జైలు ఊచలు లెక్క పెట్టే దాకా ఊరుకునే లేదు.