సినిమా జనం బయటకు వస్తే చాలు అభిమానులు గుమి గూడిపోయి ఫోటోల కోసం సేల్ఫీల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్క సెల్ఫి దిగితే చాలు అనుకుని భావిస్తూ వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు అభిమానులు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఎక్కువ కావడంతో సేల్ఫీల క్రేజ్ కూడా బాగానే పెరిగింది. ఇక హీరోయిన్లు కనపడితే చాలు కొంత మంది,
చేసే అతి అంతా ఇంతా కాదు. వాళ్ళు నడిచి వచ్చే దేవతలు మాదిరి ఫీల్ అవుతూ వాళ్ళతో ఫోటోలు దిగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఒక హీరోయిన్ తో ఇలాగే ఒక వ్యక్తి సేల్ఫీ దిగాలి అనుకున్నాడు గాని ముద్దు పెట్టాలనుకున్నాడు. దీనితో ఆ భామ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సిని పరిశ్రమలో ఇప్పుడు ఇప్పుడే నిలబడుతుంది.
తాజాగా ముంబైలో అభిమానులతో ఫోటోలు దిగి వాళ్లకు సెల్ఫీలు ఇచ్చింది సారా. ఓ అభిమాని కూడా సెల్ఫీ దిగడానికి వచ్చి చేతులు తాకేసాడు.. అసభ్యంగా ప్రవర్తించాడు. షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ పరిణామంతో ఉలిక్కిపడింది. దాంతో వెంటనే ఆమె తేరుకుని ఏం చేస్తున్నావ్ అంటూ ఆ అభిమాని సీరియస్ అయింది ఈ హీరోయిన్. ఈ వార్త ఇప్పుడు బాలివుడ్ లో హాట్ టాపిక్.