మీ దుంపలతెగ…జగన్ మీద ఇలా పడ్డారేంటి స్వామీ…

-

రాజకీయాల్లో ప్రతిపక్షాలు అనేవి…అధికార పార్టీపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. అయితే ఇదంతా ఒకప్పుడు జరిగేది అని చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాదు….మనకు బురద అంటకుండా ఎదుటవాళ్ళపై బురద జల్లడమే నేటి రాజకీయం. అసలు ఏ మాత్రం అర్ధవంతంగా లేకుండా విమర్శలు చేయడమే నేటి రాజకీయ నాయకుల పని. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష టి‌డి‌పి అదే పనిలో ఉంటుంది. గుడ్డిగా అధికార వైసీపీపై విమర్శలు చేస్తుంది.

jagan
jagan

అలా అని వైసీపీ ప్రభుత్వం ఏమి తప్పులు చేయకుండా ఉండటం లేదు…తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రతిపక్షమే ప్రశ్నించాలి. అయితే తప్పు…ఒప్పులతో మాకు పని లేదు…నిత్యం జగన్‌ని తిట్టడమే మా పని అన్నట్లుగా టి‌డి‌పి నేతలు ముందుకెళుతున్నారు. అసలు జగన్ ఒక్క మంచి పని కూడా చేయనట్లు నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. ఇటీవలైతే డ్రగ్స్ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని టి‌డి‌పి బాగా టార్గెట్ చేసింది. అసలు ఈ అంశాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు..ఎందుకంటే ఎక్కడో గుజరాత్‌లో హెరాయిన్ కంటైనర్ దొరికితే దానికి జగన్‌ని లింక్ చేసి విమర్శలు చేయడం అర్ధం లేదనే చెప్పొచ్చు. అందుకే జనం కూడా టి‌డి‌పి విమర్శలని పట్టించుకోవడం లేదు.

కానీ మనోళ్ళు ఆగరుగా…ఏదో వంతులు వేసుకుని రోజుకు ఒకరు అన్నట్లుగా టి‌డి‌పి నేతలు మీడియా ముందుకొచ్చి జగన్ డ్రగ్ డాన్ అంటూ విమర్శించడం అలవాటు అయిపోయింది. మొన్ననే పట్టాభి అడ్డగోలుగా జగన్‌పై విమర్శలు చేశారు. అసలు జగనే డ్రగ్స్ అమ్మిస్తున్నారని మాట్లాడారు. ఇక నిన్న ఏమో బుద్దా వెంకన్న బయటకొచ్చి…. రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని, డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ఇక నేడు బోండా ఉమా లైన్‌లోకి వచ్చి ఏకంగా.. ‘జే’ బ్రాండ్స్ మద్యంలో డ్రగ్స్ కలుపుతునట్లు వార్తలు వస్తున్నాయని, దేశం మొత్తానికి వైసీపీ నాయకులు గంజాయిని విచ్చలవిడిగా పంపి డబ్బు సంపాదిస్తున్నారని అన్నారు. అంటే మద్యంలో డ్రగ్స్ వాడుతున్నారని బోండా అంటున్నారు. అసలు ఇలాంటి విమర్శలు చేయడానికి కనీసం జ్ఞానం ఉండాలని చెప్పొచ్చు. కానీ టి‌డి‌పి నేతలు అవేం లేకుండా…వరుసపెట్టి జగన్‌పై పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news