ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆయన విశ్వవిఖ్యాత నటుడు.. ప్రజలకు మరింత దగ్గరయ్యాక ఆయన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి. కానీ… ఈ స్థాయిలో ప్రపంచానికి పరిచయం కాకముందు నందమూరి తారక రామారావు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఈ విషయం కొంతకాలం క్రితం వరకూ చాలా మందికి తెలియకపోయినా… బాలకృష్ణ తీసిన కథనాయకుడు మూవీ ద్వారా అందరికీ తెలిసింది. అయితే.. ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా ట్రైనింగ్ లో ఉన్నపుడు పలు దస్త్ర వీజులు రాశారు. అయితే దానికి సంబంధించిన ఒకటి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కి చెందిన నేత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో అప్పటి ఒక దస్త్ ను అభిమానులతో పంచుకున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సబ్ రిజిస్ట్రార్ ట్రైనింగ్ లో ఉండగా.. అన్నగారు స్వహస్తాలతో రాసిన దస్త్రం.. అది 2-3-1948 రోజున రాసిన దస్త్రంగా అభివర్ణించిన గోరంట్ల… అక్షరాలు కూడా ఆయన లాగే క్రమశిక్షణ గా ఉన్నాయి అని ప్రశంసల జల్లు కురిపించారు. బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.. పెద్దాయనను తలచుకుంటున్నారు!!
ఎన్టీఆర్ రైటింగ్ చూశారా… సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నపుడు రాసిన దస్త్రం ఇదిగో!
-