Breking : అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి 14 రోజుల రిమాండ్ విధించింది జిల్లా కోర్టు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి కోర్టు బయట భారీగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు మధ్య అచ్చెన్నాయుడు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి, తనకు సమీప బంధువు అయిన కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా బెదిరించారనే కేసు మీద ఆయనను అరెస్టు చేశారు. అయితే అంతకు ముందు పోలీసుల మీద అచ్చం నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే తాను హోం మంత్రి అవుతానని ఒకవేళ చంద్రబాబు ఆ పదవి ఇవ్వకపోయినా ఆయనను ఒప్పించి హోంమంత్రి పదవి తీసుకుంటానని అన్నారు. ఇప్పుడు తన మీద తప్పులు తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.. తాను నాయకులను తప్పు పట్టడం లేదని పోలీసులను తప్పు పడుతున్నానని తేల్చి చెప్పారు. ఏకంగా డిఎస్పి, ఎస్ఐలు తన బెడ్రూమ్ లోకి వచ్చారని నోటీసులు వస్తే తానే వచ్చే వాడిని కానీ దౌర్జన్యంగా తన ఇంట్లోకి వచ్చారు అని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news