ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
సీఎం జగన్ చేస్తున్న అభివృద్దికి టీడీపీ అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. జనవరిలో పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో టీడీపీకి ఆమె షాకిచ్చింది. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా పోతుల సునీతతో పాటు ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డిలు ఓటు వేశారు. వీరిద్దరూ ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు.