పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఆస్తుల విధ్వంసమా..? అని ఆయన నిలదీశారు. సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత, పట్టాభి కారు ధ్వంసం కక్ష సాధింపే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డిని వేధించడాన్ని ఖండిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
18ఏళ్ల క్రితం అంశంపై కడప హరిప్రసాద్ అరెస్ట్ చేయడం గర్హనీయం అని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి జవహర్ పై తప్పుడు కేసు వైసిపి కక్ష సాధింపే అని మండిపడ్డారు. జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేసారు. ఒకాయన బూతుల మంత్రి, మరొకాయన హవాలా మంత్రి, ఇంకొకాయన బెంజ్ మినిష్టర్ అని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కథ చెప్పక్కర్లేదని, ఇంత దుర్మార్గమైన పార్టీని ప్రభుత్వాన్ని చూడలేదని ఆయన మండిపడ్డారు. మనం చేస్తోంది దుర్మార్గులతో పోరాటం.. అనుక్షణం అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.