శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు!! దాని సంగతి మెల్లగా చూదాం!! ప్రస్తుతం ఏపీలో టీడీపీ నేతలకు పని లేదు! ఆల్ మోస్ట్ “హౌస్ హస్బెండ్” పరిస్థితి వారిది! ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనూ లేరు, ప్రజల తరుపున పోరాడనూ లేరు! జరుగుతున్న అవినీతి కేసుల విషయంలో అరెస్టుల పర్వానికి తెరలేసిన తరుణంలో.. ఎవరి టెన్షన్ లో వారున్నారు. ఇంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొరాడే అంత పరిస్థితి లేదు. బాబు పిలిచినా వచ్చే అవకాశాలు లేవు! సరిగ్గా ఈ సమయంలోనే వారికి హస్తినలో కమళం గుర్తుకు వచ్చిందంట! దానికి వారెంచుకున్న లాజిక్ మామూలుగా లేదు!
అవును… ప్రస్తుతం ఏపీ టీడీపీలో ఉంటూ, పెద్దగా పనీ పాటా లేకుండా.. అటు వ్యాపారాలు చేసుకోలేకుండా.. ఇటు రాజకీయాలూ చేసుకోలేకుండా.. పైగా ఏ క్షణం ఏసీబీ కారు ఇంటిముందు ఆగుతుందో, ఏ క్షణం పోలీసులు కాలింగ్ బెల్ మోగిస్తారో అనే టెన్షన్ తో ప్రశాంతగా తినలేకుండా.. కంటినిండా పడుకోలేకుండా.. నరకయాతన అనుభవిస్తున్నారంట! కరోనా కంటే ఈ కష్టం వారికి ఎక్కువ కష్టంగా ఉందంట! ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు చూస్తున్నారంట!
ప్రస్తుతం టీడీపీ తరుపున తమ నియోజకవర్గం తమకుంది.. ఎలాగూ సుమారు మరో నాలుగేళ్లపాటు పెద్దగా పని ఉండకపోవచ్చు. పైగా.. కాళ్లో కడుపో పట్టుకుని వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో బాబు జతకట్టేస్తారు! కాబట్టి… బీజేపీ – టీడీపీ పొత్తులో భాగంగా తమ అసెంబ్లీ టిక్కెట్లకు డోకా ఉండదు.. పైగా ఈ నాలుగేళ్లు కూడా కాస్త “చేతికి” పని దొరుకుతుంది అని భావిస్తున్నారంట! ఇంతవారకూ ఈ రాజకీయ తెలివితేటలు, ఊగాహాణాలూ బాగానే ఉన్నాయి కానీ… “పొత్తు” పొడవకపోతే?
అవును… వారనుకుంటున్నట్లు అంతా సాఫీగా సాగిపోతే.. జనాల సంగతి కాసేపు పక్కనపెడితే.. రాజకీయ నాయకులుగా వారు సేఫ్! అలా కాకుండా పొత్తు పొడవని పక్షంలో… రిస్క్ ఫ్యాక్టర్ ఏమిటో, ఎంతో చెబుతుంది “మనలోకం.కాం”!
బీజేపీ – జనసేనలు ఇప్పటికే పొత్తులో ఉన్న క్రమంలో… టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీలోని మెజారిటీ నేతలు “మరో మారు తప్పు చేయొద్దు” అన్న ఆలోచనాక్రమంలో… బీజేపీతో టీడీపీ కలిస్తే తాను ఆటలో అరటిపండునైపోతాననే పవన్ భయంలో భాగంగా.. బీజేపీ – టీడీపీ పొత్తు ఉండకపోవచ్చు! అలా జరిగిన పక్షంలో… తిరిగి వారి టీడీపీలోకి రాలేక, బీజేపీలో ఉండలేక నరకం చూడాల్సిన పరిస్థితి రావొచ్చు. ఫ్యాన్ వంక చూద్దామన్నా… నాటికి వైకాపాలో ఒక్కో స్థానానికీ ఇద్దరు ముగ్గురు అప్పటికే పోటీపడుతుంటారు!
పోనీ ఎంత చెడ్డా సొంత పార్టీ కదా అని భావించి బాబుకు కాల్ చేస్తే… బాబు నాటి పరిస్థితులను బట్టి పార్టీలోకి తీసుకుని టిక్కెట్టు ఇచ్చినా.. కార్యకర్తలు, ప్రజలు ఎంతమేరకు సపొర్ట్ చేస్తారు? పోనీ బీజేపీ తరుపునే పోటీ చేస్తే… గడిచిన ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సందర్భాలు గుర్తుకురావా?
ప్రజలను నమ్ముకోకుండా.. కేవలం అధికారంలో ఉన్న పార్టీలనే నమ్ముకోవడం.. ప్రజాశ్రేయస్సు కంటె తమ వ్యాపార పరిరక్షనే ముఖ్యమని భావించడం వల్ల.. లాంగ్ పొలిటికల్ లైఫ్ కి రిస్కేమో అంటున్నారు విశ్లేషకులు! పైగా జనం అప్పట్లా లేరు.. ప్రతీదీ అబ్జర్వ్ చేస్తున్నారు.. పైగా అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు! 2019 ఎన్నికల ఫలితాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం!