దేశ చరిత్రలో అంతటి ఘనుడు జగన్ ఒక్కడే : నారా లోకేష్

-

పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ ఒక్కడేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా ఏపీ మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటోందని.. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వం అభాసు పాలయ్యిందని చురకలు అంటించారు.

ys jagan on nara lokesh

చంద్రబాబు హయాంలో ప్రజల పై భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించిన విషయాన్ని దాచిపెట్టింది ప్రభుత్వమనీ.. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుంది అంటూ చిలక పలుకులు పలికిన జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయినా వ్యాట్ ఎందుకు తగ్గించలేదు? అని నిలదీశారు. కేవలం రూ.1 సెస్ వేసామంటూ అసత్యాలు చెబుతున్నారని.. 2020 ఫిబ్రవరి 29న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 కు పెంచారని మండిపడ్డారు.

2020 జులై 20న, మరోసారి పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 వరకూ అదనపు వ్యాట్‌ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని.. 2020 సెప్టెంబరు 18న, రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారు.. మళ్లీ దానిపైనా వ్యాట్‌ ఉందని తెలిపారు. మొత్తంగా, లీటర్ పెట్రోల్ పై రూ.30 వరకూ, డీజిల్ పై రూ.22 వరకూ పన్నులు రూపంలో బాదుతున్నారని.. గత ఏడాదితో పోల్చుకుంటే, పెట్రోల్ పై రూ.7.59, డీజిల్ పై రూ.5.46 వరకు పన్నులు రూపంలో ప్రభుత్వం అధికంగా బాదేసిందని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news