ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ నేతలు అనవసరంగా నోరు జారుతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కర వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు వ్యక్తిగత, రాజకీయ విమర్శలను ఎక్కువగా చేయడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. పరిస్థితి బాగా లేకపోయినా వాళ్ళు విమర్శలు ఆపడం లేదు.
దీనిపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనవసర విషయాల్లో తల దూరుస్తున్నారని వాళ్ళు మండిపడుతున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు కూడా ఈ వ్యవహారంపై కాస్త అసహాన్మ్గానే ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు విపక్షం అనేది బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని… ఇలాంటి సమయంలో విమర్శలు చేస్తే ప్రజల్లో చులకన అవుతామని అంటున్నారు. పార్టీ నేతలు సలహా ఇచ్చినా సరే చంద్రబాబు మారడం లేదట.
ఇక కొందరు తన సన్నిహిత నేతలతో ఆయన పదే పదే విమర్శలు అనవసరంగా చేయిస్తున్నారని మండిపడుతున్నారు. దీనితో చులకన అవడమే గాని మరో లాభం అంటూ ఏమీ లేదని అంటున్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే ఇబ్బందులు మినహా మరొకటి ఉండదు అంటున్నారు. ఇప్పటికే కరోనా విషయంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటం తో చులకన అయ్యామని ఇప్పుడు ఇంకా అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.