అసెంబ్లీ నుంచి కోటంరెడ్డి సస్పెండ్..టీడీపీ ఎమ్మెల్యేలతో!

-

ఏపీ అసెంబ్లీలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరిగింది. మొదట రోజు గవర్నర్‌ని సి‌ఎం రిసీవ్ చేసుకోలేదనే ఆరోపణలు టి‌డి‌పి నుంచి వచ్చాయి. దీనిపై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చి..గవర్నర్‌ని సి‌ఎం జగన్ రిసీవ్ చేసుకున్న వీడియోని వేసి చూపించారు.

అయితే దీనిపై ఎంతసేపటికి వైసీపీ మంత్రులు మాట్లాడటం..తనకు మైక్ ఇవ్వాలని టి‌డి‌పి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కోరారు. అయినా సరే తాను మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు..ఆయనకు తోడుగా నిమ్మల రామానాయుడుకు నిలిచారు. దీంతో ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వం చెప్పకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించడంతో..మంత్రి బుగ్గన వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ కు విన్నవించారు. దీంతో పయ్యావుల, నిమ్మలని ఈ సెషన్ పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ అయ్యారు.

సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని… వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీంతో టీడీపీ సభ్యులు 12 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

వీరితో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ రోజు ఉదయం సభ మొదలైనప్పటి నుంచి కోటంరెడ్డి నిరసన తెలియజేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. తన నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలో పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు. ఈ క్రమంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని సెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news