సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని గవర్నర్ కు విన్నవిస్తుంటాయి ప్రతిపక్షాలు! అలాకానిపక్షంలో కేంద్రంలోని ప్రధానమంత్రిని సంప్రదిస్తాయి!! అప్పటికీ స్పందన కరువైన వేల… నేరుగా రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంటాయి.. సమస్య తీవ్రతను తెలియజేస్తుంటాయి! రాజ్యాంగంలో ఇలాంటి రూల్ ఉందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… సాధారణంగా రాజకీయాల్లో జరిగేది ఇదే! ఈ క్రమంలో తాజాగా టీడీపీ ఎంపీలు నేరుగా రాష్ట్రపతిని కలవనున్నారు!
అవును… మోడీ స్పందించడం లేదో, లేక బాబు మోడీదగ్గరకొద్దన్నారో తెలియదు కానీ… రాష్ట్ర సమస్యలపై నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలవనున్నారు టీడీపీ ఎంపీలు. గత 13నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు ఏమీ బాగా లేవని మొదలుపెట్టి… ప్రాథమిక హక్కులు కాలరాయడం.. రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం.. రాజ్యాంగ ఉల్లంఘనలు మొదలైన అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు.
రాష్ట్రంలో వైసీపీ నాయకులు హింసా విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, బోర్ వెల్స్ ధ్వంసం, తోటల నరికివేత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాలు చేస్తున్నారంటూ మొదలైన విషయాల గురించి రాష్ట్రపతికి వివరించనున్నారంట టీడీపీ ఎంపీలు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు.. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు.. అంటూ ప్రతీ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారంట టీడీపీ ఎంపీలు! సో… రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!